బంగారం ధర గురువారం రూ.280 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,305 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగటం కారణంగా ఆ ప్రభావం దేశీయంగా పడింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు గురువారం రూ.260(దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,452 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,728 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.59 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:జియోకు మరో రూ.11,367 కోట్ల విదేశీ పెట్టుబడి