రూపాయి బలహీనపడటం వల్ల బంగారం ధర సోమవారం రూ. 258 పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ. 51,877కు చేరింది.
వెండి ధర కిలోకు రూ.837 పైకెగిసి రూ.69,448కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,932 డాలర్లకు పెరిగింది. వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్సు ధర రూ.26.93 డాలర్లుగా ఉంది.