బంగారం ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర సోమవారం రూ.240 పెరిగి.. రూ.52,073 వద్దకు చేరింది.
ఇటీవల వరుసగా పుంజుకుంటూ వచ్చిన రూపాయి విలువ.. సోమవారం మళ్లీ తగ్గడం వల్ల పసిడి ధరలు పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు.
వెండి ధర కిలోకు భారీగా రూ.786 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.64,927వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,925 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 25.26 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్!