ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగార ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి శుక్రవారం రూ.224 పెరిగి.. రూ.52,672 వద్దకు చేరింది.
కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పెరగటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్.. దేశీయంగా బంగారం ధరలు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.