తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2020, 4:10 PM IST

ETV Bharat / business

మరింత ప్రియమైన బంగారం, వెండి

పసిడి, వెండి ధరలు గురువారం పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మళ్లీ రూ.49,500లకు చేరువైంది. వెండి ధర కిలోకు ఏకంగా దాదాపు రూ.12 వందలు పెరిగింది.

today gold price
నేటి బంగారం ధర

బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.194 ఎగిసి.. రూ.48,455 వద్దకు చేరింది.

'అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.' అని విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు(దిల్లీలో) భారీగా రూ.1,184 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,969 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,874 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.63 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:కొత్త గరిష్ఠాలకు సూచీలు- సెన్సెక్స్@46,890

ABOUT THE AUTHOR

...view details