బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశరాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.126 పెరిగి రూ.39,160కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.380 పెరిగి రూ.46,900వద్ద స్థిరపడింది. పండుగ సమయంలో డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
పండుగ డిమాండ్‌తో పెరిగిన బంగారం ధరలు - పెరిగిన వెండి ధరలు
అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.126 పెరిగి రూ.39,160కు చేరింది. కిలో వెండి రూ.380 పెరిగి రూ.49,900 అయింది.
పండుగ డిమాండ్‌తో పెరిగిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం 1,502 డాలర్లు, ఔన్స్ వెండి 17.71 డాలర్లుగా ఉంది. డాలర్ బలహీనపడడం, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: అమెరికా, చైనా రాజీపై ఆశలు- మార్కెట్లకు లాభాలు