తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి ధర- రూ.52వేల పైనే వెండి - బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 పెరగగా... కిలో వెండి ధర రూ. 858కు ఎగబాకింది.

Gold rises Rs 120, silver zooms Rs 858
స్వల్పంగా పెరిగిన పసిడి ధర

By

Published : Jul 13, 2020, 5:57 PM IST

దేశీయ మార్కెట్​ల్లో పసిడి, వెండి ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. పసిడి ధర సోమవారం రూ.120 పెరిగింది. దీంతో దిల్లీలో రూ. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49,960కు చేరింది. వెండి ధర కూడా కిలోకు రూ. 858 పెరిగి... రూ.52,462గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్​​లో ఔన్సు పసిడి 1,805 డాలర్లు పలకగా... ఔన్సు వెండి ధర 19.03 డాలర్లుగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం వల్ల పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలు పుంజుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:రిలయన్స్​ జోరు- లాభాలతో ముగిసిన మార్కెట్లు

ABOUT THE AUTHOR

...view details