తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి పతనం.. పసిడికి రెక్కలు.. ఇవే నేటి ధరలు - Silver prices also gained Rs 293 to Rs 45,263 per kg

అంతర్జాతీయ ప్రతికూలతలు, రూపాయి క్షీణత కారణంగా.. నేడు పసిడి ధర మళ్లీ పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 118 రూపాయలు పెరిగి... రూ. 38 వేల 678కి చేరింది.

రూపాయి పతనం.. పసిడికి రెక్కలు

By

Published : Nov 11, 2019, 4:10 PM IST

బంగారం ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. నేడు దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.38 వేల 678కి చేరింది. శనివారం ట్రేడింగ్​లో 10 గ్రాములకు రూ. 38 వేల 560 వద్ద ఉండగా.. ఇవాళ 118 రూపాయల మేర పెరిగింది.

అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, రూపాయి క్షీణించడమే... ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కారణంగా... డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్​లో 20 పైసలు క్షీణించింది.

పెరిగిన వెండి ధర...

కిలో వెండి ధర రూ. 293 పెరిగి రూ. 45 వేల 263 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,463గా నమోదైంది. వెండి ఔన్సుకు 16.85 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:ఎంఎంటీఎస్​ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details