తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - నేటి మార్కెట్​లో బంగారం ధర

దేశీయంగా బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధరపై శుక్రవారం రూ.21 పెరిగింది. వెండి ధర కిలోకు రూ. 259 తగ్గింది.

Gold rises marginally, silver down by Rs 259
శుక్రవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

By

Published : Dec 18, 2020, 5:01 PM IST

పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 21 పెరిగి.. రూ. 49,644కు చేరింది.

కిలో వెండి ధర మాత్రం రూ. 259 తగ్గి.. రూ. 66,784 గా ఉంది.

అంతర్జాతీయంగా పసిడికి సానుకూలంగా డిమాండ్ ఉందని విశ్లేషకులు చెప్పారు. అందువల్లే దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా మార్పుచెందాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,879 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.71 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:ఒడుదొడుకుల ట్రేడింగ్​లోనూ రికార్డు గరిష్ఠాలు

ABOUT THE AUTHOR

...view details