తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేడు ఎంతంటే...! - పది గ్రాముల బంగారం ధర

పసిడి, వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.32 పెరిగింది. వెండి కిలోకు రూ.116 పుంజుకుంది.

gold
బంగారం

By

Published : Jan 17, 2020, 5:23 PM IST

బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.32 పెరిగి.. రూ.40,590కి చేరింది.

రూపాయి బలహీనపడటము, అంతర్జాతీయంగా పసిడికి ఉన్న డిమాండు నేపథ్యంలో దేశీయంగా ధరలు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.116 (దిల్లీలో) పెరిగి.. రూ.47,756 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,555 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.02 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:2019-20 క్యూ3లో స్వల్పంగా పెరిగిన టీసీఎస్​ లాభం

ABOUT THE AUTHOR

...view details