తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర (Gold Price today) భారీగా తగ్గింది. వెండి ధర కూడా అదే దారిలో పతనమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.200 తగ్గగా.. వెండి ధర (Silver price today) కిలోకు రూ.610 కిందికి దిగింది.

By

Published : Nov 15, 2021, 10:27 AM IST

GOLD RATES TODAY
బంగారం ధర

బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. సోమవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.200 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.610 క్షీణించింది. ఆంధ్రప్రదేశ్ ​తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర(Gold Price in Hyderabad) రూ.50,640గా ఉంది. కిలో వెండి ధర రూ.68,249 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు(Gold Price in Vijayawada) రూ.50,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,249గా ఉంది.
  • విశాఖపట్నంలో పది గ్రాములకు పుత్తడి ధర(Gold Price in Vizag) రూ.50,640గా ఉంది. కిలో వెండి ధర రూ.68,249 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పెరిగాయి.

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1857.80 డాలర్లుగా ఉంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.97 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్,​ డీజిల్​ ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇదీ చదవండి:E Commerce sales: పండగ సీజన్​లో రూ.65వేల కోట్ల విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details