తెలంగాణ

telangana

ETV Bharat / business

పుత్తడి మళ్లీ పైపైకి.. 10 గ్రాముల ధరెంతంటే?

పుత్తడి ధర క్రమంగా పెరుగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర నేడు రూ.181 వృద్ధి చెందింది. కిలో వెండి ధర రూ.270 పెరిగింది.

బంగారం ధరలు

By

Published : Nov 1, 2019, 5:17 PM IST

పసిడి మళ్లీ పరుగు పెడుతోంది. ఇటీవల ధర కాస్త తగ్గినా.. తిరిగి నెమ్మదిగా పుంజుకుంటోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.181 వృద్ధితో.. రూ.39,395కి చేరింది.

అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో పసడిపై పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా ధరలు పెరగుతూ వస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కిలో వెండి ధర (దిల్లీలో) నేడు రూ.270 పెరిగి.. రూ.47,900 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర అత్యధికంగా 1,513 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.13 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: అక్టోబర్​లోనూ నిరాశపరిచిన జీఎస్టీ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details