పుత్తడి ధర మళ్లీ భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.115 వృద్ధితో.. రూ.39,017కి చేరింది. రూపాయి క్షీణించడం, అంతర్జాతీయ సానుకూలతలు.. ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
కిలో వెండి ధర (దిల్లీలో) నేడు రూ.95 పెరిగి.. రూ.47,490 వద్దకు చేరింది.