తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.39 వేలు దాటిన పసిడి ధర.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?

బంగారం ధర మళ్లీ రికార్డు దిశగా పెరుగుతూ వస్తోంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర నేడు రూ.39,000 మార్క్​ను దాటింది. పసిడితో పాటు వెండి ధర నేడు భారీగా పెరిగింది.

By

Published : Dec 23, 2019, 5:24 PM IST

GOLD
బంగారం

దేశీయంగా పసిడి ధర మళ్లీ రూ.39 వేలు దాటింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.187 పెరిగి.. రూ.39,053కు చేరింది.

అంతర్జాతీయంగా పెరిగిన డిమాండు, దేశీయంగా రూపాయి బలహీనపడటం పసిడి ధర వృద్ధికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.495 (దిల్లీలో) పెరిగి.. రూ.46,499కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,484 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.36 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చూడండి:'నల్ల కుబేరుల' గుట్టు విప్పేందుకు కేంద్రం నిరాకరణ..!

ABOUT THE AUTHOR

...view details