తెలంగాణ

telangana

ETV Bharat / business

దీపావళి ముందు తగ్గిన బంగారం జోరు...! - బంగారం ధరలపై తాజా వార్తలు

కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు గురువారం దాదాపు స్థిరంగా ట్రేడయ్యాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఇవాళ రూ. 3 పెరిగి... రూ. 39,375కు చేరింది.

పసిడి ప్రస్తుత ధర ఎంతంటే...

By

Published : Oct 10, 2019, 4:43 PM IST

పసిడి ధరలు గురువారం దాదాపు స్థిరంగా ట్రేడయ్యాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు స్వల్పంగా రూ. 3 పెరిగి.. దేశ రాజధాని దిల్లీలో రూ.39,375కు చేరింది.

వెండి...

బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ వెండి కాస్త దిగొచ్చింది. కిలో వెండి ధర దిల్లీలో రూ. 24 తగ్గి.. రూ.47,120కు చేరుకుంది.

" అమెరికా, చైనాల మధ్య రెండు రోజుల వాణిజ్య చర్చలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రోజుల్లో ఏదైనా ప్రకటన ఉంటుందని మదుపర్లు ఎదురుచూస్తున్నారు. యూఎస్​-చైనా వాణిజ్య చర్చల్లో నెలకొన్న అనిశ్చితితో అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 1,510డాలర్లకు చేరుకోవటం వల్ల గురువారం పసిడి ధరలు స్థిరంగా ట్రేడయ్యాయి."

- తపన్​ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీ సీనియర్​ విశ్లేషకులు.

ఇదీ చూడండి: త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకం- మార్కెట్లకు నష్టం

ABOUT THE AUTHOR

...view details