బంగారం ధర జీవితకాల గరిష్ఠానికి పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.720 పెరిగి రూ.41,730కి చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు శ్రేయస్కరమని మదుపరులు భావించడం వల్ల ధర పెరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి క్షీణత కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.
ట్రంప్ ఎఫెక్ట్: జీవితకాల గరిష్ఠానికి బంగారం ధర - జీవిత కాల గరిష్టానికి బంగారం ధర
బంగారం ధర జీవితకాల గరిష్ఠానికి ఎగబాకింది. దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.720 పెరిగి రూ.41,730కి చేరుకుంది. వెండి రూ.1,105 పెరిగి రూ.49,430వద్ద స్థిరపడింది.
ట్రంప్ ఎఫెక్ట్: జీవితకాల గరిష్ఠానికి బంగారం ధర
వెండి ధర కిలోకు రూ.1,105 పెరిగి రూ.49,430కి చేరింది.
అంతర్జాతీయంగా బంగారం ధర ఓ దశలో 2.3 శాతం పెరిగి ఔన్సుకు 1588.13 అమెరికన్ డాలర్లకు చేరింది. 2013 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యధికం. అనంతరం 1,575 అమెరికన్ డాలర్ల వద్ద ముగిసింది.