తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి ధరలు మళ్లీ పరుగు- ప్రస్తుత ధర ఎంతంటే... - TODAYS GOLD PRICES

అంతర్జాతీయంగా ఉన్న భారీ డిమాండ్​తో బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఇవాళ ఒక్క రోజే రూ. 315 పెరిగి... రూ. 39,010కు చేరింది.

పసిడి ధరలు మళ్లీ పరుగు- ప్రస్తుత ధర ఎంతంటే...

By

Published : Oct 9, 2019, 4:39 PM IST

పసిడి ధరలు మరోసారి పరుగందుకున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ. 315 పెరిగి.. దేశ రాజధాని దిల్లీలో రూ.39,010కు చేరింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండుతో పుత్తడి ధరలు పుంజుకుంటున్నాయని నిపుణులు తెలిపారు.

వెండి...

బంగారం దారిలోనే వెండి ధరలు పుంజుకున్నాయి. కిలో వెండి ధర దిల్లీలో రూ. 1,010 పెరిగి.. రూ.47,330కు చేరుకుంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల వృద్ధితో వెండి ధరలు పెరిగాయి.

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్​ ఆందోళనలు వంటి కారణాలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,507 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details