బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.73 తగ్గి రూ.39,882గా ఉంది. కిలో వెండి ధర రూ.156 తగ్గి రూ.47,910గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ బంగారం 1,513.50 డాలర్లు, ఔన్స్ వెండి ధర రూ.17.87 డాలర్లుగా ట్రేడయ్యాయి.
ధరలు పెరుగుతూనే ఉంటాయ్..
ఈరోజు స్వల్పంగా తగ్గినా... రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"అమెరికా, పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్త పడుతున్నారు. నష్టభయం లేకుండా ఉండేందుకు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి." - నవనీత్ దమాని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు (కమొడిటీస్ రీసెర్చ్)
ఇదీ చూడండి:ఆద్యంతం ఊగిసలాడి ఫ్లాట్గా ముగిసిన సూచీలు