తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొచ్చిన బంగారం ధర- 10 గ్రాములు ఎంతో తెలుసా? - బంగారం రేటు

దేశీయ మార్కెట్లో బంగారం ధర దిగొస్తోంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర నేడు రూ.516 క్షీణించింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.47,234కు పెరిగింది.

gold rates today
నేటి బంగారం ధరలు

By

Published : Mar 11, 2020, 4:47 PM IST

బంగారం ధర నేడు గణనీయంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.516 తగ్గి.. రూ.44,517 చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి కాస్త పుంజుకోవడం వల్ల బంగారం ధరలు తగ్గినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వెండి ధర మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. కిలోకు (దిల్లీలో) రూ.146 వృద్ధితో.. రూ.47,234 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,661 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 17.03 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:స్టేట్​ బ్యాంక్​ శుభవార్త- వడ్డీరేట్లు తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details