తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి మరింత చౌక.. ప్రస్తుత ధరెంతంటే..! - బిజినెస్ వార్తలు తెలుగు

పుత్తడి, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.101, కిలో వెండి రూ.29 క్షీణించింది.

స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ప్రస్తుత ధరెంతంటే..!

By

Published : Nov 5, 2019, 5:05 PM IST

పసిడి ధరల పరుగు నేడు కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.101 తగ్గి.. రూ.39,213కి చేరింది.

రూపాయి పుంజుకోవడం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడమే ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

కిలో వెండి ధర(దిల్లీలో) నేడు రూ.29 తగ్గి.. రూ.47,580 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,505 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సుకు 18.4 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: లోగో మార్చిన ఫేస్​బుక్​.. ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details