దేశీయంగా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి రేటు సోమవారం రూ.19 తగ్గి.. రూ.46,286కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి డిమాండ్ తగ్గడం, రూపాయి విలువ పెరగటం వల్లే.. దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు.