బంగారం ధర నేడు మరింత ప్రియమైంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.112 పెరిగి.. రూ.41,249కి చేరింది.
రూపాయి క్షీణించడం, వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగటం వంటి పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు వృద్ధి చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
బంగారంతో పాటే వెండి ధర నేడు స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర నేడు రూ.94 (దిల్లీలో) వృద్ధితో.. రూ.47,305 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఔన్సు బంగారం ధర 1,566.7 డాలర్లు, వెండి ఔన్సుకు 17.79 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:పబ్లిక్ క్లౌడ్‌తో.. 100 బిలియన్ డాలర్లు, 2.4 లక్షల ఉద్యోగాలు!