తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold rate today: రూ.50వేల దిగువకు బంగారం ధర-ఏపీ, తెలంగాణలో ఇలా.. - బంగారం ధరలు తాజా సమాచారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర మంగళవారం భారీగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.900 దిగొచ్చింది. వెండి ధర కిలోకు రూ.1,090 తగ్గి.. రూ.66,760కు చేరుకుంది.

Gold price, Silver rate
బంగారం ధర, వెండి ధర

By

Published : Nov 23, 2021, 10:01 AM IST

బంగారం ధరలో (Gold price Today) భారీగా తగ్గుదల నమోదైంది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.900 తగ్గి.. రూ.50వేల దిగువకు చేరింది. పసిడి బాటలో పయనించిన వెండి కిలోకు రూ.1090 దిగొచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.49,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,760 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold Price in Vijayawada) ధర రూ.49,600గా ఉంది. కిలో వెండి ధర రూ.66,760 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,760 వద్ద కొనసాగుతోంది

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,809 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.31 డాలర్లు పలుకుతోంది.

ఇంధన ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ వివాదానికి త్వరలోనే చెక్​!

ABOUT THE AUTHOR

...view details