తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొచ్చిన పసిడి- ఏపీ, తెలంగాణలో ప్రస్తుత ధరలు ఇవే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర కాస్త దిగొచ్చింది. వెండి (Silver price today) ధర కూడా స్వల్పంగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

Gold price today
బంగారం ధరలు

By

Published : Sep 28, 2021, 9:55 AM IST

బంగారం ధర (Gold Rate Today) మంగళవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) కిలో అతి స్వల్పంగా రూ.50 దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.160కిపైగా తగ్గి.. రూ.47,610 కు చేరింది. కిలో వెండి ధర రూ.62,250 కు చేరింది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,610గా ఉంది. కిలో వెండి ధర రూ.62,250 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,610గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,250గా వద్దకు చేరింది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,750.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 22.62 డాలర్లుగా ఉంది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా మంగళవారం పెట్రోల్​, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్​ ధర లీటర్​ 19 పైసలు.. డీజిల్(Diesel price today)​ లీటర్​ 27 పైసల చొప్పున పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​కు (Petrol Price in Hyderabad)​ ధర 19 పైసలు పెరిగి రూ.105.46 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్​ ధర 27 పైసలు ఎగబాకి.. రూ.97.7కు పెరిగింది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 19 పైసలు పెరిగి రూ.106.42గా పెరిగింది. లీటర్​ డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.98.16 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్​పై 19 పైసలు పెరిగి.. లీటర్​ ధర (Petrol Price in Guntur) రూ.107.69కి పెరిగింది. డీజిల్​ లీటర్​పై 26 పైసలు పెరిగి.. రూ.99.39 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:BPCL News: 'అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు'

ABOUT THE AUTHOR

...view details