బంగారం ధరలు ఇవాళ ఆల్‌టైం రికార్డును సృష్టించాయి. తొలిసారిగా 10 గ్రాముల పసిడి రూ.50 వేల గరిష్ఠ స్థాయిని దాటింది. మదుపరులు పుత్తడిపై పెట్టుబడులకు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక శాతం పెరగటం వల్ల తొమ్మిదేళ్ల గరిష్ఠానికి బంగారం ధర చేరింది.
దూసుకెళ్తోంది...
గత కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ.. డబుల్ స్పీడ్‌తో బంగారం ధరలు పెరగటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు, మూడు రోజులుగా 2 వేల పైచిలుకు పెరుగుదలను నమోదు చేసిన 10 గ్రాముల బంగారం ఇవాళ ఏకంగా 50 వేల మార్కును దాటింది.
అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా వరుస ఉద్దీపనల అంచనాలు పసిడి డిమాండ్‌ను పెంచేశాయి. షేర్ మార్కెట్ పతనంతో మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు మళ్లుతున్నారు. దీంతో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఒకే రోజు 500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది.
వెండి ధర సైతం ఆకాశనంటుతోంది. కేజీ వెండి ధర సుమారు 3,400 రూపాయల మేర పెరిగి.. రూ.61 వేలకు మించింది.