బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.451 తగ్గి.. రూ.46,844 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించడం.. దేశీయంగా తగ్గేందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా రూ.559 క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.67,465 వద్ద నిలిచింది. అంతకుముందు ఈ ధర రూ.68,024గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,805 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 25.93 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.