తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.49వేలపైకి 10 గ్రాముల పసిడి ధర

బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం దిల్లీలో మళ్లీ రూ.49 వేల పైకి చేరింది. వెండి ధర కిలో రూ.1,227 ఎగిసింది.

Gold and silver price rise
పెరిగిన పసిడి ధరలు

By

Published : Jan 21, 2021, 4:23 PM IST

బంగారం ధర గురువారం భారీగా రూ.575 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,125 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్​కు తగ్గట్లు దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,227 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,699 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,870.50 డాలర్లకు పెరిగింది. వెండి ధర 25.83 డాలర్లకు ఎగిసింది.

ఇదీ చూడండి:20 కోట్లు దాటిన నెట్​ఫ్లిక్స్​ వినియోగదారులు

ABOUT THE AUTHOR

...view details