బంగారం ధరల(Gold price) గురువారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.861 తగ్గి.. రూ.46,863 వద్దకు చేరింది. యూఎస్ ఫెడరల్ వ్యాఖలతో డాలర్ రేటు పెరిగిన కారణంగా.. పసిడి ధర క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా రూ.1,709 క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.68,798 వద్ద నిలిచింది. అంతకుముందు ఈ ధర రూ.70,507గా ఉండేది.