తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం ధర - పది గ్రాముల బంగారం ధర

బంగారం ధర గురువారం భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.700లకు పైగా తగ్గింది. వెండి ధర మోస్తరుగా తగ్గి.. రూ.70 వేల మార్క్ దిగువకు చేరింది.

Gold price down Hugely
భారీగా తగ్గిన బంగారం ధర

By

Published : Jan 7, 2021, 4:04 PM IST

బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం భారీగా రూ.714 తగ్గి.. రూ.50,335 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా బంగారానికి తగ్గిన డిమాండ్​కు అనుగుణంగా దేశీయంగాను పసిడి ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.386 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,708 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,916 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.07 డాలర్ల వద్ద ప్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:రెండో రోజూ నష్టాలు- ఐటీ, ఎఫ్​ఎంసీజీ బేజారు

ABOUT THE AUTHOR

...view details