బంగారం ధర బుధవారం భారీగా దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.674 తగ్గి.. రూ.51,215 వద్దకు చేరింది.
ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన రూపాయి విలువ.. బుధవారం మళ్లీ పుంజుకోవడం, దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుండటం వంటివి పసిడి ధర తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.