తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం రూ.500కు పైగా తగ్గింది. వెండి ధర కిలో రూ.67,350 దిగువకు చేరింది.

Gold Price
బంగారం ధరలు

By

Published : Apr 28, 2021, 4:15 PM IST

బంగారం, వెండి ధరలు ఒక్క రోజులో భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.505 తగ్గి.. రూ.46,518 వద్దకు చేరింది.

'అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గాయి. దీనితో దేశీయంగానూ బంగారం ధరలు దిగొస్తున్నాయి' అని విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా రూ.828 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.67,312 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,769 డాలర్లకు దిగొచ్చింది. వెండి మాత్రం ఔన్సుకు 26.02 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:రుణ దరఖాస్తు తరచూ తిరస్కరణకు గురవుతోందా?

ABOUT THE AUTHOR

...view details