పసిడి ధర సోమవారం కాస్త పెరిగింది. రూ. 57 పెరిగి రూ. 49,767కు చేరింది. అటు వెండి ధర కిలోకు రూ. 185 తగ్గి రూ. 61,351గా నమోదైంది.
స్వల్పంగా పెరిగిన పసిడి ధర - పెరిగిన బంగారం ధరలు
దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.57 పెరిగి రూ.49,767కు చేరింది. వెండి ధర మాత్రం 185 రూపాయలు తగ్గింది.
పెరిగిన పసిడి ధర,తగ్గిన వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,874 డాలర్లకు పెరిగింది. వెండి ధర మాత్రం 24.22 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
కెనడా తదితర దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పసిడి ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.