తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం, వెండి ధరలు మరింత ప్రియం

పసిడి, వెండి మరింత ప్రియమయ్యాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.410కి పైగా పెరిగింది. వెండి ధర కిలోకు రూ.68,300 దాటింది.

Gold price today
బంగారం ధర

By

Published : Apr 19, 2021, 4:35 PM IST

బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్చమైన పసిడి ధర రూ.411 ఎగిసి.. రూ.47,291 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు రూ.338 పెరిగింది. దీనితో కిలో ధర రూ.68,335కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,787 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు స్వల్పంగా పెరిగి.. 26.08 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చదవండి:'ఆటో' రంగంపై కరోనా సెగ- విక్రయాలు తగ్గేనా?

ABOUT THE AUTHOR

...view details