తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - silver rate in delhi

పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర మంగళవారం దాదాపు రూ.303 పెరిగింది. వెండి ధర కిలో రూ.70,261 వద్ద స్థిర పడింది.

gold and silver price
బంగారం, వెండి ధరలు

By

Published : Jun 15, 2021, 3:55 PM IST

బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.303 పెరిగి.. రూ.47,853 వద్దకు చేరింది. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం పసిడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా రూ.134 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,261 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,864 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 27.65 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details