తెలంగాణ

telangana

మరింత ప్రియమైన బంగారం.. నేటి ధరలు ఇవే

By

Published : Dec 24, 2019, 5:25 PM IST

క్రిస్మస్​ కొనుగోళ్ల డిమాండ్​తో పసిడి, వెండి ధరలు నేడు పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.191 వృద్ధి చెందింది. వెండి కిలోకు రూ.47 వేలు దాటింది.

GOLD
బంగారం

దేశీయ మార్కెట్లో బంగారం ధర వరుసగా పెరుగుతూ రికార్డు దిశగా ప్రయాణిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.191 పెరిగి..రూ.39,239కి చేరింది.

క్రిస్మస్​ సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కొనుగోళ్ల డిమాండు నేటి ధరల వృద్ధికి ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు.

కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.943 (దిల్లీలో) పెరిగి రూ.47,146కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,491 డాలర్లకు వృద్ధి చెందింది. వెండి ఔన్సుకు 17.60 డాలర్లకు పెరిగింది.

ఇదీ చూడండి:వృద్ధి భయాలతో.. మార్కెట్లకు రెండో రోజూ నష్టాలే

ABOUT THE AUTHOR

...view details