బంగారం ధర బుధవారం భారీగా రూ.1,365 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర సరికొత్త రికార్డు స్థాయి వద్ద రూ.56,181వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం భయాలు నెలకొన్న నేపథ్యంలో పసిడిపై భారీగా పెట్టుబడులు పెరగటం.. ధరలు రికార్డు స్థాయికి చేరేందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.