తెలంగాణ

telangana

ETV Bharat / business

11ఏళ్ల కనిష్ఠానికి బంగారు ఆభరణాల డిమాండ్​

దేశంలో బంగారం డిమాండ్​పైనా తీవ్ర ప్రభావం చూపింది కరోనా వైరస్​. తొలి త్రైమాసికంలో పసిడి డిమాండ్ గతం కంటే​ 41శాతం తగ్గి 73.9 టన్నులకు పడిపోయింది. గత11ఏళ్లల్లో ఇదే కనిష్ఠం. రెండో త్రైమాసికంలో పరిస్థితులు ఇంతకు మించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Gold jewellery demand in Q1 dips to 11-year low of 74 tonnes: WGC
11ఏళ్ల కనిష్ఠానికి బంగారం ఆభరణాల డిమాండ్​

By

Published : May 1, 2020, 6:13 AM IST

Updated : May 1, 2020, 7:13 AM IST

భారత్​లో బంగారం ఆభరణాల డిమాండ్​ ఒక్కసారిగా 11ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 73.9 టన్నులకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది 41శాతం తక్కువని ప్రపంచ బంగారు మండలి ​(డబ్ల్యూజీసీ) తెలిపింది. అప్పటికే.. దేశీయంగా ఉన్న పసిడి ధరలు, కరెన్సీ క్షీణతపై కరోనా వైరస్​ ప్రభావం పడటం వల్ల ఇలా జరిగిందని పేర్కొంది.

పెళ్లిళ్ల సీజన్​తో తొలి త్రైమాసికంలోని తొలి భాగంలో పసిడికి డిమాండ్​ పెరిగింది. అయితే ఫిబ్రవరి మధ్య వారాల్లో స్థానికంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా కొనుగోలుదారులు బంగారంవైపు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత అమలైన లాక్​డౌన్​ వల్ల మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మార్చి నెలలో 60-80శాతం మేర డిమాండ్​ పడిపోయింది. క్యూ1లో 10గ్రాముల పసిడి ధర సగటున రూ.41,124గా ఉండగా.. మార్చిలో స్థానిక బంగారం ధర నూతన రికార్డులను సృష్టించి రూ. 44,315 (10 గ్రాముల పసిడి)కు చేరింది.

ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించింది. దీంతో నగరాల్లోని మధ్యతరగతి కొనుగోలుదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.

అయితే రెండో త్రైమాసికంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.

Last Updated : May 1, 2020, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details