తెలంగాణ

telangana

ETV Bharat / business

35.5 శాతం పెరిగిన బంగారం దిగుమతులు - quarter

ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి దేశంలో పసిడి దిగుమతులు జోరందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 35.5 శాతం బంగారం దిగుమతులు వృద్ధి చెందాయి.

35.5శాతం పెరిగిన బంగారం దిగుమతులు

By

Published : Aug 13, 2019, 6:32 AM IST

Updated : Sep 26, 2019, 8:07 PM IST

దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చినా దిగుమతుల్లో మాత్రం జోరు తగ్గలేదు. ఏప్రిల్​-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 35.5 శాతం పెరిగినట్లు వాణిజ్యశాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బంగారం దిగుమతుల విలువ రూ. 59వేల కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.80వేల కోట్లకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఏటా 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది భారత్. ఈ ఏడాది దిగుమతుల్లో ఫిబ్రవరి మినహా ప్రతినెలా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.

Last Updated : Sep 26, 2019, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details