తెలంగాణ

telangana

ETV Bharat / business

3.3 శాతం తగ్గిన పసిడి దిగుమతులు

దేశంలో బంగారం దిగుమతులు 3.3 శాతం మేర తగ్గాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21 ఏప్రిల్-ఫిబ్రవరి​ మధ్య కాలంలో బంగారం దిగుమతులు 26.11 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు తెలిపింది.

Gold imports slip 3.3 pc to USD 26.11 bn in Apr-Feb
బంగారం దిగుమతులు తగ్గాయ్..

By

Published : Mar 21, 2021, 5:11 PM IST

2020-21 ఏప్రిల్​-ఫిబ్రవరి మధ్యకాలంలో బంగారం దిగుమతులు 3.3 శాతం తగ్గి 26.11 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-20 ఇదే కాలంలో పసిడి దిగుమతులు 27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ క్షీణత.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 84.62 బిలియన్ డాలర్లకు తగ్గేందుకు దోహదపడిందని పేర్కొంది. గతేడాది ఇది 151.37 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్​ ఒకటి. సంవత్సరానికి 800-900 టన్నుల పసిడిని భారత్​ దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులు తగ్గిన నేపథ్యంలో ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషించారు. 2020-21 ఏప్రిల్-ఫిబ్రవరిలో వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు 33.86 శాతం క్షీణించి 22.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఇక ఈ ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు 5.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో దిగుమతైన బంగారం 2.36 బిలియన్ డాలర్లు. గడచిన 11 నెలల్లో వెండి దిగుమతులు 70.3 శాతం తగ్గి.. 780.75 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఇదీ చదవండి:స్వదేశీ X విదేశీ: ఈ-కామర్స్ వార్​లో గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details