తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం విషయంలో భారత్​కు సూపర్​ గుడ్​ న్యూస్​! - బంగారం దిగుమతులు తగ్గించుకుంటున్న భారత్​

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-డిసెంబర్​ మధ్యకాలంలో బంగారం దిగుమతులు 6.77 శాతం తగ్గినట్ల వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది . ఫలితంగా దేశ వాణిజ్య లోటు, కరెంట్ ఖాతా​ లోటు కూడా తగ్గినట్లు పేర్కొంది.

Gold imports dip 6.77 pc during April-Dec 2019
6.77 శాతం తగ్గిన బంగారం దిగుమతులు

By

Published : Jan 26, 2020, 4:41 PM IST

Updated : Feb 25, 2020, 4:50 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశ బంగారం దిగుమతులు 6.77 శాతం తగ్గాయి. 23 బిలియన్ డాలర్ల విలువైన పసిడి మాత్రమే దిగుమతి అయినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2018-19లో ఇదే సమయంలో 24.73 బిలియన్​ డాలర్ల విలువైన పసిడి భారత్​కు దిగుమతి అయ్యింది.

వాణిజ్య లోటు తగ్గింది

బంగారం దిగుమతుల క్షీణత వల్ల దేశ వాణిజ్య లోటు 118 బిలియన్​ డాలర్లకు తగ్గేందుకు దోహదపడింది. గతేడాది 148.23 బిలియన్​ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. 2019 జులై-సెప్టెంబర్​లో సీఏడీ... స్థూల జాతీయోత్పత్తిలో 0.9 శాతానికి లేదా 6.3 బిలియన్​ డాలర్లకు తగ్గింది.

గతేడాది అక్టోబర్- నవంబర్​ మధ్య బంగారం దిగుమతులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. డిసెంబర్​లో మాత్రం కేవలం 4 శాతానికి పరిమితమయ్యాయి. కానీ ఈ ఏడాది జులై నుంచి బంగారం దిగుమతులు బాగా తగ్గాయి.

పసిడి దిగుమతి వల్ల..

భారత్​ అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం. ఏటా 800-900 టన్నుల మేర పసిడి దిగుమతి అవుతుంది. ఇది ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్​ను తీరుస్తుంది.

అధిక బంగారం దిగుమతుల వల్ల దేశానికి వాణిజ్యలోటు, కరెంట్ ఖాతా లోటు పెరిగిపోతుంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.

అయితే ఈ అధిక సుంకం కారణంగా ఆభరణాల పరిశ్రమ రంగంలోని వ్యాపారాలు తమ తయారీ సంస్థలను పొరుగుదేశాలకు మారుస్తున్నారని ఆ పరిశ్రమకు చెందిన నిపుణులు చెబుతున్నారు.

సుంకాలు తగ్గించాలి!

పసిడి దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్​పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్​ (జీజేఈపీసీ) కోరింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్​లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 6.4 శాతం క్షీణించి, 27.9 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి.

ఇదీ చూడండి: పద్దు 2020: 'ఆడీ' అడిగినట్లు కేంద్రం చేస్తుందా?

Last Updated : Feb 25, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details