తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర- 10గ్రాములు ఎంతంటే? - gold

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో 10 గ్రాములకు రూ.324 పెరిగి.. రూ.51,704కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,598 ఎగబాకింది. దీంతో కిలో వెండి రూ.62,972కి చేరింది.

gold price today
బంగారం ఈరోజు ధర

By

Published : Oct 16, 2020, 5:12 PM IST

Updated : Oct 16, 2020, 6:31 PM IST

మూడు రోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్​ ప్రభావంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ.324 పెరిగి రూ.51,704కి చేరింది.

వెండి ధర సైతం భారీగా ఎగబాకింది. కిలో వెండి రూ.1,598 వృద్ధి చెంది.. రూ62,972కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పుంజుకుంది. ఔన్సు పసిడి 1,910 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ట్రేడింగ్ ఫ్లాట్​గా ఉంది. ప్రస్తుతం ఔన్సు వెండి ధర 24.35గా ఉంది.

మార్కెట్లో అనిశ్చితులు, కరోనా కేసుల్లో పెరుగుదల, ఐరోపాలో మళ్లీ లాక్​డౌన్ ఆంక్షలు వంటి పరిణామాల మధ్య బంగారం ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Last Updated : Oct 16, 2020, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details