బంగారం ధర బుధవారం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 311 వృద్ధి చెంది.. రూ.40, 241కు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కాస్త క్షీణించడం కారణంగానే బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర సానుకూలంగా కదలాడటం మరో కారణంగా చెబుతున్నారు.