అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.153 పెరిగి రూ. 48,144 కు చేరింది.
అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.665 తగ్గి.. రూ. 49,235 కు చేరింది.