తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం ధరలు.. 10గ్రాములు ఎంతంటే? - వెండి మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజీ ధర

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ ప్రభావంతో పుత్తడి ధర సోమవారం 0.44 శాతం మేర పతనమైంది. పది గ్రాములకు రూ.51,490కి చేరింది. అదే సమయంలో వెండి ధరలు 0.85 శాతం పతనమయ్యాయి.

gold latest news
బంగారంపై డిమాండ్ దెబ్బ- మళ్లీ పతనం

By

Published : Sep 21, 2020, 4:24 PM IST

డిమాండ్ లేమితో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. సోమవారం 0.44 శాతం మేర క్షీణింంచిన పది గ్రాముల పుత్తడి ధర.. రూ.51,490కి చేరింది.

మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజీలో బంగారం అక్టోబర్ కాంట్రాక్టు ధరలు రూ.225(0.44 శాతం) పతనం కాగా... డిసెంబర్ నెలకు రూ. 243(0.47 శాతం) తగ్గి.. రూ.51,617కి చేరింది.

అటు అంతర్జాతీయంగానూ బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. న్యూయార్క్​లో 0.37 శాతం పతనమైంది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,954.80 డాలర్లుగా ట్రేడవుతోంది.

బంగారం బాటలోనే..

వెండి ధరలు సైతం నేలచూపులు చూస్తున్నాయి. కిలో వెండి ధర రూ.577 తగ్గి.. రూ.67,300కి పరిమితమైంది. డిమాండ్ లేమి కారణంగా వెండి ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ మార్కెట్లలో వెండి ధర 1.30 శాతం తగ్గి ఔన్సుకు 26.78 డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details