బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.81 తగ్గి.. రూ.46,976 వద్దకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పుంజుకోవడం పసిడి ధరల తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర భారీగా రూ.984 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి ధర రూ.67,987 వద్ద ఉంది.