తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన పసిడి ధర.. రూ.50 వేల దిగువకు కిలో వెండి - 10 గ్రాముల బంగారం ధర

పసిడి, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.57 తగ్గింది. వెండి ధర రూ.50 వేల దిగువకు చేరింది.

gold decline
తగ్గిన బంగారం ధరలు

By

Published : Jun 23, 2020, 6:05 PM IST

బంగారం ధర మంగళవారం స్వల్పంగా రూ.57 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,931 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం, డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరగడం వల్ల.. ఆ ప్రభావం దేశీయంగా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వెండి ధర మాత్రం భారీగా కిలోకు రూ.477(దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,548 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,755 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.82 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఫ్యాబిఫ్లూ టు కొరోనిల్... ఏ మందు ఎవరికి?

ABOUT THE AUTHOR

...view details