తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం ధర- వెండి కాస్త ప్రియం

దేశీయంగా పసిడి ధర కాస్త తగ్గింది. గురువారం.. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.47,500 దిగువకు చేరింది. ఇదే సమయంలో వెండి మాత్రం కిలో దాదాపు రూ.240 పెరిగింది.

Gold price dip
తగ్గిన బంగారం ధర

By

Published : Apr 22, 2021, 4:08 PM IST

బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. 10 గ్రాముల స్వచ్చమైన పసిడి ధర గురువారం రూ.168 తగ్గి.. రూ.47,450 వద్దకు చేరింది.

వెండి ధర మాత్రం కిలోకు రూ.238 పెరిగింది. దీనితో కిలో ధర ప్రస్తుతం రూ.69.117 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,791 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 26.45 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:'వాట్సాప్​ బిజినెస్'లో మరిన్ని ఫీచర్లు​

ABOUT THE AUTHOR

...view details