పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.68 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,547కి చేరింది.
దేశీయంగా పసిడి కొనుగోళ్ల డిమాండు తగ్గడమే ధరల క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి బలపడుతుండటమూ పసిడి ధరల తగ్గుదలకు మరో కారణంగా చెబుతున్నారు.