తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి బలపడింది.. బంగారం ధర తగ్గింది - బంగారం

రూపాయి బలపడిన నేపథ్యంలో బంగారం, వెండి ధరల స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.41, 270గా, కిలో వెండి రూ.47,080గా ఉంది.

Gold drops Rs 388
రూపాయి బలపడింది.. బంగారం ధర తగ్గింది

By

Published : Feb 4, 2020, 4:19 PM IST

Updated : Feb 29, 2020, 3:57 AM IST

పసిడి, వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.388 తగ్గి రూ.41,270గా ఉంది. కిలో వెండి ధర కూడా రూ.346 తగ్గి రూ.47,080కు చేరింది.

"రూపాయి బలపడడం, ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడమే దేశీయంగా పసిడి, వెండి ధరలు తగ్గడానికి కారణం."

- తపన్ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్ అనలిస్ట్

ఉద్దీపనతో

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,570 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.73 డాలర్లుగా ఉంది.
చైనా ప్రభుత్వానికి అక్కడి కేంద్ర బ్యాంకు ఆర్థిక ఉద్దీపన ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకొని ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు దిగొచ్చాయి.

ఇదీ చూడండి: దూసుకెళ్లిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 917 పాయింట్లు వృద్ధి

Last Updated : Feb 29, 2020, 3:57 AM IST

ABOUT THE AUTHOR

...view details