తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు - కిలో వెండి ధర

పసిడి, వెండి ధరలు బుధవారం కాస్త తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర అతి స్వల్పంగా రూ.40 దిగొచ్చింది. వెండి ధర భారీగా తగ్గి.. కిలో రూ.69 వేల దిగువకు చేరింది.

gold price down
తగ్గిన బంగారం ధర

By

Published : Feb 10, 2021, 5:17 PM IST

బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.38 తగ్గి.. రూ.47,576 వద్దకు చేరింది.

వెండి ధర భారీగా రూ.783 క్షీణించింది. కిలో ధర రూ.68,884 వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకోవటం వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,843 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.31 డాలర్లకు ఎగిసింది.

ఇదీ చదవండి:రెండో రోజూ నష్టాలు- 15,100 వద్ద నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details